సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో 20 రోజుల ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు శనివారం వదిలి వెళ్లారు. ఆడ శిశువు కేకలు వినిపించడంతో ఆసుపత్రి సిబ్బంది అక్కడికి వెళ్లారు. శిశువుకు సంబంధించిన బంధువుల ఆచూకీ లభించకపోవడంతో శిశుగృహకు తరలించినట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.