సంగారెడ్డి: పాలిసెట్ 2025 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

పాలిసెట్ 2025 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్. జానకి దేవి తెలిపారు. కేంద్రంలో పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ఈనెల 13వ తేదీన నిర్వహించే ఈ పరీక్షకు జిల్లాలో 2784 మంది విద్యార్థులు రాయనున్నారని పేర్కొన్నారు. సంగారెడ్డిలోని ఎస్వీ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్