సంగారెడ్డిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు రెండున్నర నెలల ఆడ శిశువు మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం సాయంత్రం వదిలేశారు. ఆసుపత్రి వర్గాలు సంగారెడ్డి పట్టణ పోలీసులకు సమాచారాన్ని అందించారు. చిన్నారి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తిస్తామని చెప్పారు.