మహిళలు వ్యాపారాలు చేసి ఆర్థికంగా ఎదగాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో 50 మహిళా సంఘాల సభ్యులకు కోటి రూపాయల లింకేజీ రుణాలను శుక్రవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ రుణాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.