రేపు కొండాపూర్ లో ముగ్గురు మంత్రుల పర్యటన

కొండాపూర్ మండలంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, దామోదర రాజనర్సింహ ఈనెల 17వ తేదీన పర్యటిస్తారని డిసిసి అధ్యక్షురాలు నిర్మలారెడ్డి శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అధికారులు పార్టీ నాయకులు కార్యక్రమానికి సకాలంలో హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్