సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జింక మాంసాన్ని అమ్మెందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. సమాచారం రావడంతో ఫైర్ స్టేషన్ వద్ద మాంసంతో సహా పట్టుకోగా, ఇరువురు యువకులు పారిపోయారు. పోలీసులు పారిపోయిన యువకులు అదుపులోకి తీసుకొని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. గాండ్ల వాజిద్, దూదేకుల ఆసిఫ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు డిప్యూటీ రేంజర్ వేణుగోపాల్ వివరించారు.