పిడుగు పడి ఇద్దరు మృతి

పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన సంఘటన న్యాల్కల్ , కొహీర్ మండలాల్లో బుధవారం చోటుచేసుకుంది. న్యాల్కల్ మండలం డప్పురు గ్రామానికి చెందిన సాబీర్ (15) భారీ వర్షం కురుస్తుండడంతో చెట్టు కింద నిలబడ్డాడు. పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రత్నమ్మ (61) పై కూడా పిడుగు పడటంతో మరణించింది.

సంబంధిత పోస్ట్