గుండెపోటుతో టీచర్ మృతిచెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొమురవెల్లి మండలం మర్రిముచ్చాల గ్రామానికి చెందిన పీఈటీ ఉపాధ్యాయుడు అశోక్, కొమురవెల్లి జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేసిన ఆయన ఇటీవలే దుంపలపల్లి హైస్కూల్ కు బదిలీపై వెళ్లారు. బుధవారం ఉదయం ఆయన గుండెపోటుతో చనిపోవడంతో విషాదం నెలకొంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.