కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోస్ ముందు హాజరయ్యేందుకు బుధవారం బయలుదేరిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎర్రవెల్లి నివాసం నుంచి బయలుదేరు. ఆయన వెంట మాజీ మంత్రి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తదితరులు ఉన్నారు.