మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. సిద్ధిపేట పట్టణంలోని పలు ప్రాంతాలలో సిబ్బందితో కలిసి నిర్వహించిన తనిఖీల్లో ఎనిమిది మంది వాహనదారులు పట్టుబడ్డారు. వారిని గురువారం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రూ. 12వేలు జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.