సిద్ధిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్ సమీపంలోని చౌరస్తా వద్ద రెండు బైక్ లు ఢీ కొన్న సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి జిల్లా సాదువెల్లి గ్రామానికి చెందిన కనకయ్య చేర్యాల మండలం గుర్జకుంట గ్రామంలో జరిగిన బీరప్ప పండుగ సందర్భంగా తమ బంధువుల ఇంటికి వెళ్లి మంగళవారం సాయంత్రం బైక్ పై తిరుగుప్రయాణమయ్యాడు. అదే సమయంలో బైక్ పై సత్తయ్య వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్తుండగా, ప్రమాదవశాత్తు బైక్ లు ఢీ కొన్నాయి. దీంతో ఇరువురికి గాయాలై రక్తస్రావం జరిగింది.