సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామంలోని దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం గురువారం అర్థరాత్రి గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి వెండి కిరీటం, నగలు దోచుకెళ్లినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.