ఫార్మాసిటీ కోసం భూములు తీసుకోవద్దని కోరుతూ న్యాల్కల్ మండలం డప్పురు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శిని రైతులు బుధవారం నిర్బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని వారిని విడిపించారు. ఫార్మాసిటీ కోసం తమ విలువైన భూములను తీసుకోవద్దని రైతులు కోరారు. భూ సేకరణ ఆపకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.