మేడారం మహాజాతర ముగిసిన వారం రోజుల తర్వాత, ఆదివాసి ఆచారాల ప్రకారం తిరుగువారం వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వనదేవతలకు జంతుబలి ఇచ్చి సాంప్రదాయ పూజలు చేశారు. మేడారం చుట్టూ కట్టడిచేసి, దేవాలయాలను శుద్ధి చేసి, వనదేవతలకు ప్రీతికరమైన నైవేద్యంగా జంతుబలి ఇచ్చి, జాగరణతో వేడుకలు ముగిశాయి. మహాజాతరలో దర్శనం చేసుకోలేని భక్తులు ఈ తిరుగువారం సందర్భంగా తరలివచ్చి, సుమారు ఐదు లక్షల మంది మొక్కులు చెల్లించుకున్నారు.