TG: హైదరాబాద్ మియాపూర్‌లోని హోటల్లో యువతి అనుమానాస్ఫద స్థితిలో మృతి చెందిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలు సంగారెడ్డికి చెందిన కోమటి సృజన(27)గా గుర్తించారు. సృజన హనుమకొండలో పీజీ పీడియాట్రిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సెప్టెంబర్ 30న HYDకు వచ్చిన తర్వాత కనిపించకుండా పోయింది. తండ్రి ఫిర్యాదుతో మొబైల్ లొకేషన్ ఆధారంగా హోటల్లో ఉన్నట్టు గుర్తించారు. డీకంపోజ్ అయిన స్థితిలో బాడీ లభించడంతో పోస్టుమార్టం చేశాక ఫ్యామిలీకి అప్పగించారు. గతంలో సృజన, రవికుమార్ అనే వ్యక్తి ప్రేమించుకున్నట్టు తెలుస్తోంది. తండ్రి ఫిర్యాదుతో రవికుమార్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.