మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఒక మెడికల్ ఆఫీసర్‌ను ఆయన కార్యాలయంలోకి వచ్చి కొట్టిన వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆసుపత్రికి చెందిన మెడికల్ ఆఫీసర్ బాల ప్రసాద్ ఆసుపత్రిలోని ఒక మహిళా ఉద్యోగినిని వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆగ్రహించిన ఆ మహిళా ఉద్యోగిని బంధువులు, ఆఫీసర్ కార్యాలయంలోకి వచ్చి, బాల ప్రసాద్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.