యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రతిష్టాత్మక హాస్పిటల్‌లో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి లేదు. ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 20 లోపు దరఖాస్తు చేసుకోవాలి. అదే రోజు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మరిన్ని వివరాలకు www.ucil.gov.in సందర్శించండి.