మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య

AP: విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రా మెడికల్ కాలేజీలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన శ్రావణి (22) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చినవాల్తేరులో అద్దె ఇంట్లో ఉంటున్న ఆమె, ఉదయం ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు సమాచారం అందింది. ఎస్ఐ శకుంతల ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕