యూపీలోని ఆగ్రాలోని మానసిక ఆరోగ్య సంస్థలో ఎమ్‌డి కోర్సు చదువుతున్న డాక్టర్ వర్తికా సింగ్ మృతదేహం గదిలో లభ్యమైంది. నిద్రమాత్రలు అధిక మోతాదులో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. గత ఫిబ్రవరిలో ఒక సీనియర్ రెసిడెంట్ వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించగా, విచారణలో ఆ రెసిడెంట్‌కు క్లీన్ చిట్ లభించింది. అప్పటి నుంచి ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది.