హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి నితిన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నితిన్ గురువారం రాత్రి విధులకు హాజరయ్యాడు. శుక్రవారం ఉదయం ఆపరేషన్ థియేటర్‌లో విగతజీవిగా పడిఉన్నాడు. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.