చెట్ల వేళ్ళు, బెరడు, ఆకులు, పూలు, కాయలు, పుల్లలు, పండ్లు, విత్తనాలు మొత్తంగా అన్నిభాగాలను ఆయుర్వేదం, సిద్ద, యునానీ వైద్య విధానాలలో ఉపయోగిస్తారు. వీటి నుంచి అనేకరకాల మందులను తయారు చేస్తారు. పొలాలకు క్రిమిసంహారక మందులు కూడా చెట్ల ఆధారంగా తయారు చేస్తారు. ప్రకృతిలో ప్రాణం పురుడు పోసుకున్న రోజునే. తరువు కూడా పురుడు పోసుకుంది. ఈ ప్రకృతిలో ఎంతటి కఠినమైన దీర్ఘకాలిక రోగాలకు కూడా ఈ ప్రకృతిలో ఔషదీకృత మొక్కలు వృక్షాలు వున్నాయి.