సింగర్ మంగ్లీకి క్షమాపణలు చెప్పిన 'మేడిపల్లి స్టార్'

TG: ఇటీవల ఫోక్‌ సింగర్‌ మంగ్లీ పాడిన ‘బాయిలోనే బల్లి పలికే’ పాటను కించపరుస్తూ 'మేడిపల్లి స్టార్' అనే పేరు గల ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై మంగ్లీ ఎస్ఆర్‌ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ క్రమంలోనే మంగ్లీకి క్షమాపణ చెబుతూ సదరు వ్యక్తి ఓ వీడియో రిలీజ్ చేశాడు. ‘నన్ను క్షమించు అక్క.. ఇంకెప్పుడూ కించపరిచే కామెంట్స్ చేయను’ అని పేర్కొన్నాడు. కాగా పోలీసులు ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్