TG టెట్, AP DSC ఒకే తేదీల్లో ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 2 పరీక్షలకు దరఖాస్తు చేసిన సుమారు 7,000 మంది తెలంగాణ అభ్యర్థులు ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 20న టెట్ పేపర్–1, DSC SGT పరీక్షలు ఒకేసారి ఉండడం ప్రధాన సమస్యగా మారింది. పరీక్షా కేంద్రాలు కొంతమందికి హైదరాబాద్‌లో, మరికొందరికి APలో రావడంతో పరీక్ష తేదీలు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.