అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై మెగాస్టార్ చిరంజీవి తన స్పందన తెలియజేశారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన విమానంలో జరిగిన ఈ విషాద ఘటన విని ఎంతో బాధపడానని చెప్పారు. "ఇది ఎంత హృదయవేదన కలిగించే విషయం మాటల్లో చెప్పలేను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను" అని చిరంజీవి చెప్పారు.