వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు 'సీడ్ గణేశ' అనే వినూత్న కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. కెమికల్స్‌తో కూడిన విగ్రహాల వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని నివారించేందుకు, సహజ పదార్థాలు, విత్తనాలతో ఈ విగ్రహాలను రూపొందించారు. పూజ అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేసి, నీరు పోస్తే అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదుగుతాయి. ఈ కార్యక్రమానికి 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ప్రతినిధులు మద్దతు తెలిపారు. గణేశుడిని పూజిస్తూనే ప్రకృతిని కాపాడుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.