అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ మంగళవారం బ్యూనస్ఎయిర్స్‌లో జాంబియాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో అర్జెంటీనా 5-0తో గెలిచిన తర్వాత తన సొంతగడ్డపై చివరి మ్యాచ్ ఆడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రేక్షకుల 'మెస్సీ.. మెస్సీ' నినాదాలతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. 38 ఏళ్ల మెస్సీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వ్యక్తమవుతుండగా, 2026 ఫిఫా ప్రపంచకప్ అతని చివరి టోర్నీ కావచ్చని ప్రచారం జరుగుతోంది.