TG: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈ నెల 13న హైదరాబాద్‌కు రానున్నాడు. ఆయన అపర్యటనకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఆ రోజు 4PMకు ఆయన HYD చేరుకొని ఓ హోటల్లో రెస్ట్ తీసుకుంటారు. రాత్రి 7గంటలకు ఉప్పల్ స్టేడియానికి వెళ్లి సీఎం రేవంత్ టీంతో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత స్కూల్ పిల్లలతో ఇంటరాక్షన్ ఉండనుంది. అనంతరం పరేడ్, మెస్సీకి సన్మానం నిర్వహించనున్నారు. దాదాపు 2గంటల పర్యటన తర్వాత మెస్సీ అదే రోజు తిరుగు పయనమవుతారు.