రూ.8,700 కోట్లు ఇస్తామంటూ మెటా ఆఫర్.. అయినా ఆమెను వదలని ఉద్యోగులు

AI రంగంలో టాలెంట్ ఉన్నందుకు టెక్‌ దిగ్గజం మెటా రూ.8,755 కోట్ల భారీ ఆఫర్‌ చేసినా, మీరా మురాటీ స్థాపించిన "థింకింగ్ మెషిన్స్ ల్యాబ్‌" నుంచి ఒక్క ఉద్యోగి కూడా బయటకు వెళ్లలేదు. కనీసం సంవత్సరం కూడా పూర్తి కాని ఈ స్టార్టప్‌లో పనిచేస్తున్న 30 మంది ఏఐ నిపుణులంతా మురాటీ నాయకత్వంపై నమ్మకంతో అండగా నిలిచారని తెలుస్తోంది. మార్క్ జుకర్‌బర్గ్‌ స్వయంగా కొందరిని కలిసినా, ఎవ్వరూ మెటా వైపు మొగ్గచూపలేదని ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

సంబంధిత పోస్ట్