తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, వాతావరణ శాఖ ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గుండె, శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట బయటకు వెళ్లవద్దని సూచించింది. రైతులు తమ పంటలను చలిగాలుల నుంచి రక్షించుకోవాలని తెలిపింది. రాబోయే రోజుల్లో పలు ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు, పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రయాణాలు, పనులలో అప్రమత్తంగా ఉండాలని IMD హెచ్చరించింది.