ఈ ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా, వర్షపాతం తక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. హిమాలయ ప్రాంతంలో పొడి వాతావరణం దీనికి కారణమని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల పంటల పెరుగుదల వేగవంతమై, గోధుమ, బార్లీ వంటివి ముందుగానే కోతకు వస్తాయన్నారు. దీనివల్ల గింజలు సరిగా ఏర్పడక దిగుబడి తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, కేంద్ర పర్యాటక శాఖ ప్రకారం, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.