ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో సాంకేతిక అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ 365, Outlook, Teams, Copilot సహా పలు సేవలు ఏడు గంటలకు పైగా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇమెయిల్స్, ఫైళ్ల యాక్సెస్, ఏఐ సేవల వినియోగంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సురక్షిత కనెక్షన్ల ఏర్పాటుపై సర్వర్లకు అధిక భారం పడటమే సమస్యకు కారణమని సంస్థ వెల్లడించింది. ఈ ప్రభావం OpenAI, Anthropic సేవలపైనా పడింది. సర్వర్లను పునఃప్రారంభించి, కాన్ఫిగరేషన్లో మార్పులు చేస్తూ సేవలను పునరుద్ధరించేందుకు మైక్రోసాఫ్ట్ చర్యలు చేపట్టింది.