ప్రపంచవ్యాప్తంగా సుమారు 36 గంటల పాటు నిలిచిపోయిన మైక్రోసాఫ్ట్ సేవలు ఎట్టకేలకు పునరుద్ధరించబడ్డాయి. అవుట్‌లుక్, టీమ్స్, మైక్రోసాఫ్ట్ 365, కోపైలట్ సహా అన్ని సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. సాంకేతిక సమస్యను పూర్తిగా పరిష్కరించామని, వినియోగదారులు ఇకపై ఎలాంటి అంతరాయం లేకుండా సేవలను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఈ అంతరాయం కారణంగా 70కి పైగా దేశాల్లో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసౌకర్యానికి సంస్థ క్షమాపణలు తెలిపింది.