టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్‌లో భారీ నష్టాలను చవిచూసింది. కొన్ని గంటల్లోనే కంపెనీ వాల్యుయేషన్‌లో 12 శాతం నష్టపోగా, దాని విలువ 400 బిలియన్ డాలర్లకు పైగా పడిపోయింది. భారతీయ కరెన్సీలో ఇది రూ.36 లక్షల కోట్లకు సమానం. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒకే రోజులో ఇది రెండో అతిపెద్ద నష్టంగా నమోదైంది. గత ఏడాది జనవరిలో ఎన్విడియా 593 బిలియన్ డాలర్లను కోల్పోయింది.