ఇంటర్ విద్యార్థులకు జూన్ నుంచి మధ్యాహ్న భోజనం: భట్టి విక్రమార్క

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం  ఖమ్మం జిల్లా  బోనకల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టికాహారంతో పాటు విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇంటర్ విద్యార్థులకు కూడా ‘మిడ్ డే మీల్స్’ పథకాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్