ఎలక్ట్రిక్ బస్సు డ్రైవింగ్ చేసిన మంత్రి కోమటిరెడ్డి (VIDEO)

నల్గొండ జిల్లాలో ప్రజా రవాణా సేవలను అభివృద్ధి చేయడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. నల్గొండ బస్ స్టేషన్‌లో తాజాగా 40 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా స్టీరింగ్ పట్టుకుని ఒక ఎలక్ట్రిక్ బస్సును నడిపారు.

సంబంధిత పోస్ట్