తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. వరంగల్‌లోని కృష్ణ కాలనీ బాలికల జూనియర్ కళాశాలలో రూ.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవన శంకుస్థాపనలో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా పనుల కోసం, ఫైళ్ల క్లియరెన్స్ కోసం డబ్బులు మంత్రులు తీసుకుంటారని.. కానీ తాను డబ్బులు తీసుకోనని, స్కూల్ అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.