కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుటుంబానికి, పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపడం (E20) విధానానికి మధ్య వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. గడ్కరీ కుమారులు 'మానస్ ఆగ్రో', 'సియాన్ ఆగ్రో' సంస్థల ద్వారా ఇథనాల్ వ్యాపారంలో ఉన్నారని, ప్రభుత్వ విధానం వల్ల వారికి లబ్ధి చేకూరుతుందని విపక్షాలు, సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అయితే, ఈ విమర్శలను మంత్రి నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు. ఇథనాల్ వాడకం రైతుల ఆదాయం, ముడి చమురు దిగుమతుల తగ్గింపు, కాలుష్య నియంత్రణకు ఉద్దేశించిన దేశ ప్రయోజనకరమైన విధానమని, దీనికి తన కుటుంబ వ్యాపారాలకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.