మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావ్ కోకాటే అసెంబ్లీలో ఇటీవల మొబైల్ ఫోన్‌లో రమ్మీ ఆడి విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనను వ్యవసాయ శాఖ నుంచి క్రీడల శాఖకు మార్చుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మంత్రి వర్గం నుంచి మాణిక్‌రావ్ కోకాటేను తప్పించకుండా శాఖ మార్చడంతో విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.