TG: మేడారం మహా జాతరలో భాగంగా సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. జాతరలో తొలి ఘట్టమైన సారలమ్మ గద్దెపైకి చేరిన సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.