రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం (వీడియో)

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్ళలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, రైతులతో కలిసి స్వయంగా నాగలి దున్ని విత్తనాలు చల్లారు. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం ఉన్నందున, మంచి ఆరుతడి పంటలు వేసి అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా బాగుండాలని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఏరువాక పౌర్ణమి రోజు తెలంగాణలో వ్యవసాయ ప్రారంభ దినమని, ఈ సీజన్ లో సమృద్ధి వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దేశానికే వెన్నెముక అయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్