సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం

TG: సీఎం రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 2006లో రాజకీయాల్లోకి వచ్చి, జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎదిగి నేడు ముఖ్యమంత్రిగా ప్రజాసేవ చేస్తున్న రేవంత్ రెడ్డి యువ నాయకులకు స్ఫూర్తిదాయకమని మంత్రి పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ఆయన నిరంతర పోరాటం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, తెలంగాణ అభివృద్ధిపై దూరదృష్టి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయని ప్రశంసించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్