రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రి పొన్నం చర్చ (వీడియో)

TG: గాంధీభవన్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో మంత్రి, పీసీసీ జిల్లా ఇన్‌ఛార్జి పొన్నం ప్రభాకర్‌ భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన.. సంస్థాగత పార్టీ నిర్మాణం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీ బలోపేతానికి నేతలందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్