తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం హేట్ స్పీచ్ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. సోషల్ మీడియాలో కులమతాలను నిందిస్తూ, మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగాలు, పోస్టుల ద్వారా జరిగే విధ్వంసాలను అరికట్టేందుకు ఈ బిల్లును తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. నిందితులకు కఠిన శిక్షలు, బాధితులకు న్యాయం జరిగేలా పలు అంశాలను ఈ బిల్లులో పొందుపరిచామన్నారు. నేరస్థులకు 1-7 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 వేల వరకు జరిమానా విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయన్నారు.