తిరుమల శ్రీవారిని దర్శించుకున్నమంత్రి పొన్నం ప్రభాకర్

TG: రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనేక విపత్తుల నుంచి స్వామివారు ప్రజలను ఆదుకున్నారని పేర్కొన్నారు. ఎల్‌నినో పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఎల్‌నినో ప్రభావం నుంచి కాపాడాలని శ్రీవారిని వేడుకున్నానని చెప్పారు. అలాగే మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ జేకే మహేశ్వరి, ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕