TG: అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తనపై కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మీరేమంటారంటూ మంత్రిని ఓ విలేఖరి ప్రశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. "ప్రభుత్వం కక్ష సాధింపుగా ఎక్కడా వ్యవహరించ లేదు. కక్ష సాధింపు ఎక్కడ కనపడిందో నాకు అర్థం కాలేదు. అసెంబ్లీలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ స్పష్టంగా మాట్లాడారు" అని పేర్కొన్నారు.