కానిస్టేబుల్ చెంప చెల్లుమ‌నిపించిన మంత్రి సోద‌రుడు (వీడియో)

మంత్రి బీసీ జనార్ద‌న్ రెడ్డి సోద‌రుడు మ‌ద‌న భూపాల్ రెడ్డి ఏఆర్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. నంద్యాల జిల్లా బ‌న‌గాప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ కార్యక్ర‌మానికి మ‌ద‌న భూపాల్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలో అక్క‌డ విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ జ‌స్వంత్‌కు భూపాల్‌రెడ్డికి మ‌ధ్య వాగ్వాదం ఏర్ప‌డింది. దీంతో ఆగ్ర‌హానికి గురైన కూట‌మి నేత భూపాల్ రెడ్డి కానిస్టేబుల్ చెంప‌పై కొట్టారు. దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

సంబంధిత పోస్ట్