నేతన్న సేవలో పథకం అర్హులకు మంత్రి సవిత కీలక సూచన

ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సోమవారం మధ్యాహ్నం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 'నేతన్న సేవలో' పథకం అమలుపై చర్చించి, చేనేత కార్మికులకు కీలక సూచనలు చేశారు. అర్హులు ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వం ఇచ్చే రూ.25 వేల ఆర్థిక సాయాన్ని అందుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న గుంటూరు జిల్లా చీరాలలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕