TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ కేంద్రమంత్రి కుమార స్వామితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీసీఐ, ఎస్ఐఎల్ సంస్థలను పునరుద్ధరించాలని కేంద్రమంత్రిని ఆయన కోరారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తికి కేంద్రమంత్రి కుమార స్వామి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.