పామాయిల్ ధరలపై కమిటీ ఏర్పాటు: మంత్రి తుమ్మల

తెలంగాణ ఆయిల్‌పామ్‌ రైతుల ధరల సమస్యపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన రబీ అభియాన్‌ సదస్సులో రాష్ట్ర రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయిల్‌పామ్‌ ధరల నియంత్రణ, స్థిరీకరణపై కమిటీ అధ్యయనం చేస్తుందని తెలిపారు. అలాగే భూసార పరీక్షల కోసం శాటిలైట్‌ ఆధారిత సాయిల్‌ హెల్త్‌ టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్

✕
✕