ఉగాది నాటికి ఏపీ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణపై స్పష్టత రానుంది. టీడీపీ నుంచి పలువురు మంత్రులను తొలగించి, కొత్తవారికి అవకాశం కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఖాయమని, కొత్తగా ఏర్పాటు చేయనున్న సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ శాఖను ఆయనకు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది.